వీరబల్లి ముచ్చట్లు:
వీరబల్లి ఎంపీడీవో కార్యాలయం ఎదుట AISP ఆధ్వర్యంలో బీసీ సంక్షేమ వసతి గృహ విద్యార్థులతో ధర్నా నిర్వహించారు.
రాష్ట్ర అధ్యక్షుడు తుమ్మల లవకుమార్ మాట్లాడుతూ, 1987 నుంచి పేద విద్యార్థులకు ఆసరాగా ఉన్న వసతి గృహాన్ని మూసివేయడం సరికాదన్నారు. జూన్ 12 తర్వాత చేరిన విద్యార్థులను స్వగ్రామాలకు వెళ్లాలని చెప్పడం అన్యాయమని విమర్శించారు. కొత్త అడ్మిషన్లు చేపట్టి వసతి గృహాన్ని కొనసాగించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం నిర్ణయం మార్చుకోకపోతే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు.
Tags: Decision to close BC hostel must be withdrawn: AISP