అన్నమయ్య జిల్లాముచ్చట్లు:
అన్నమయ్య జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్, ఎస్పీ ధీరజ్ గుర్రంకొండ పోలీస్ స్టేషన్‌ను సందర్శించి బాధితులతో నేరుగా మాట్లాడి పోలీసు సేవలపై ఆరా తీశారు. మహిళలు, చిన్నారుల రక్షణకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని అధికారులకు సూచించారు.
పోక్సో, బాల్య వివాహాల కేసులపై ప్రత్యేక నిఘా ఉంచి బాధితులకు సత్వర న్యాయం అందేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. మహిళా పోలీసులు క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉంటూ ఫిర్యాదులను వెంటనే పై అధికారుల దృష్టికి తీసుకెళ్లాలని సూచించారు. గ్రామాలు, విద్యాసంస్థల్లో మహిళా భద్రత, చట్టాలపై నిరంతరం అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని పేర్కొన్నారు.
Tags: Collector and SP visit Gurramkonda police station.