July 9, 2026
Explore
ప్రభుత్వ సంస్థలను ప్రైవేటుపరం చేయడం సరికాదు: గడికోట

ప్రభుత్వ సంస్థలను ప్రైవేటుపరం చేయడం సరికాదు: గడికోట

July 9, 2026 | Andhra Pradesh

రాయచోటి ముచ్చట్లు:

రాయచోటి YSRCP కార్యాలయం లో మాజీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ, 1995–2004 మధ్య CM గా ఉన్న సమయంలోనూ చంద్రబాబు నాయుడు ప్రజా ఆస్తులను వారి బినాములకు కట్టబెట్టారని విమర్శించారు.

ప్రభుత్వం చేపట్టే అభివృద్ధి కార్యక్రమాలకు తమ పార్టీ ఎప్పుడూ అడ్డంకి కాదని స్పష్టం చేశారు. అయితే ప్రభుత్వ సంస్థలను వరుసగా ప్రైవేటుపరం చేస్తున్నారని మండిపడ్డారు. గత ప్రభుత్వ హయాంలో ప్రారంభించిన 17 మెడికల్ కళాశాలలను కూడా ప్రైవేటుపరం చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపిస్తూ, ఆరోగ్య రంగాన్ని ప్రైవేటు చేతుల్లోకి నెట్టడం ప్రజలకు నష్టం కలిగిస్తుందని పేర్కొన్నారు.

Tags: Privatizing government institutions is not right: Gadikota