రాజంపేట ముచ్చట్లు:
రాజంపేట, నారపరెడ్డిపల్లె, నందలూరులో నిర్వహించిన టీడీపీ యూనిట్ స్థాయి సమావేశాలకు నియోజకవర్గ ఇన్‌చార్జి చమర్తి జగన్‌మోహన్ రాజు, అబ్జర్వర్ భీమినేని చిట్టిబాబు హాజరయ్యారు.
ఈ సందర్భంగా జగన్‌మోహన్ రాజు మాట్లాడుతూ సీఎం చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఎన్డీఏ ప్రభుత్వం సంక్షేమం, అభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తోందన్నారు. ప్రతి బూత్‌లో పార్టీని బలోపేతం చేయడంతో పాటు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులందరికీ చేరేలా కార్యకర్తలు పనిచేయాలని సూచించారు. అర్హులైన ప్రతి ఓటరు పేరు ఓటరు జాబితాలో నమోదు అయ్యేలా కృషి చేయాలని, రానున్న స్థానిక ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా పార్టీ శ్రేణులంతా సమన్వయంతో పనిచేయాలని పిలుపునిచ్చారు.
Tags: Party workers must strive to strengthen the TDP: Chamarthi