July 9, 2026
Explore
ప్లాస్టిక్ వినియోగం, రోడ్లపై చెత్త వేస్తే రూ.3 వేల జరిమానా

ప్లాస్టిక్ వినియోగం, రోడ్లపై చెత్త వేస్తే రూ.3 వేల జరిమానా

July 9, 2026 | Andhra Pradesh

మదనపల్లె ముచ్చట్లు:

మదనపల్లె పురపాలక సంఘం పరిధిలో ప్లాస్టిక్ కవర్ల వినియోగం, రోడ్లు, కాలువల్లో చెత్త వేయడాన్ని పూర్తిగా నిషేధించినట్లు మున్సిపల్ అధికారులు తెలిపారు.

అన్నమయ్య జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ప్రత్యేక తనిఖీలు నిర్వహించి నిబంధనలు ఉల్లంఘించిన వారిపై రూ.3,000 అపరాధ రుసుము విధిస్తున్నట్లు వెల్లడించారు. వ్యాపార సంస్థలు, గృహ నిర్మాణ సంస్థల యజమానులు, ప్రజలు ప్లాస్టిక్ వినియోగాన్ని పూర్తిగా మానేసి పట్టణ పరిశుభ్రతకు సహకరించాలని కమిషనర్ విజ్ఞప్తి చేశారు.

ప్రతిరోజూ శుభ్రం చేసిన రోడ్లు, కాలువల్లో చెత్త వేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. పరిశుభ్రమైన మదనపల్లె కోసం ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని కోరారు.

Tags: Fine of ₹3,000 for plastic usage or littering on roads.