July 9, 2026
Explore
లక్కీ స్కీం పేరుతో ప్రజలను మోసం చేసిన వ్యక్తి అరెస్ట్.

లక్కీ స్కీం పేరుతో ప్రజలను మోసం చేసిన వ్యక్తి అరెస్ట్.

July 9, 2026 | Andhra Pradesh

శ్రీకాకుళం ముచ్చట్లు:

లక్కీ స్కీం పేరుతో ప్రజల నుంచి నగదు సేకరించి మోసానికి పాల్పడిన వ్యక్తిని అరెస్ట్ చేసి న్యాయస్థానానికి తరలించినట్లు కాశీబుగ్గ సీఐ వై. రామకృష్ణ తెలిపారు.

ఆయన తెలిపిన వివరాల ప్రకారం, కాశీబుగ్గకు చెందిన తండుగు శ్రీధర్ 2008 మార్చి నెలలో “కారుణ్య మొబైల్ లక్కీ స్కీం” పేరుతో పథకాన్ని ప్రారంభించి పలువురు సభ్యుల నుంచి నగదు సేకరించాడు. స్కీం నిబంధనల ప్రకారం 2026లో సభ్యులకు నగదు చెల్లించాల్సి ఉండగా, బాధితులకు డబ్బులు చెల్లించకుండా పరారయ్యాడు.

ఈ నేపథ్యంలో బాధితులు కాశీబుగ్గ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా, కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు నిందితుడిని గుర్తించి అరెస్ట్ చేశారు. అనంతరం నిందితుడిని న్యాయస్థానంలో హాజరుపరిచినట్లు సీఐ తెలిపారు.

ఈ కార్యక్రమంలో ఎస్సై సునీల్‌తో పాటు పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

Tags; Man arrested for defrauding people under the guise of a ‘lucky scheme’.