July 8, 2026
Explore
వీరబల్లి బీసీ వసతి గృహం మూసివేత నిర్ణయం వెనక్కి తీసుకోవాలి: AISP

వీరబల్లి బీసీ వసతి గృహం మూసివేత నిర్ణయం వెనక్కి తీసుకోవాలి: AISP

July 8, 2026 | Andhra Pradesh

వీరబల్లి ముచ్చట్లు:

వీరబల్లి మండల బీసీ సంక్షేమ వసతి గృహం మూసివేత నిర్ణయాన్ని రాష్ట్ర ప్రభుత్వం వెంటనే వెనక్కి తీసుకోవాలని AISP రాష్ట్ర అధ్యక్షుడు తుమ్మల లవకుమార్ డిమాండ్ చేశారు. ఈ మేరకు ఎంపీడీవో జవహర్‌బాబుకు వినతిపత్రం అందజేశారు.

1987 నుంచి వేలాది మంది పేద, గ్రామీణ విద్యార్థులకు ఈ వసతి గృహం విద్యాభ్యాసానికి ఆసరాగా నిలిచిందని పేర్కొన్నారు. విద్యార్థులు లేరనే కారణంతో హాస్టల్‌ను మూసివేయడం సరికాదని, కొత్త అడ్మిషన్లకు అవకాశం కల్పించాలని కోరారు. ప్రభుత్వం నిర్ణయం మార్చుకోకపోతే విద్యార్థులతో కలిసి ప్రజాస్వామ్యబద్ధంగా ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు.

Tags: Decision to close Veeraballi BC hostel must be withdrawn: AISP