July 8, 2026
Explore
రాయచోటిలో బాక్సింగ్ శిక్షణా కేంద్రం ఏర్పాటుకు మంత్రి విజ్ఞప్తి

రాయచోటిలో బాక్సింగ్ శిక్షణా కేంద్రం ఏర్పాటుకు మంత్రి విజ్ఞప్తి

July 8, 2026 | Andhra Pradesh

రాయచోటి ముచ్చట్లు:

న్యూఢిల్లీలో భారత మాజీ అంతర్జాతీయ బాక్సర్ విజేందర్ సింగ్‌ను రాష్ట్ర రవాణా, యువజన, క్రీడాశాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. రాష్ట్రంలో అంతర్జాతీయ ప్రమాణాలతో బాక్సింగ్ అకాడమీ ఏర్పాటు చేసి యువతకు ప్రపంచస్థాయి శిక్షణ అందించేందుకు సహకరించాలని కోరారు.

అలాగే రాయచోటి నియోజకవర్గంలో బాక్సింగ్ శిక్షణా కేంద్రం లేదా ఆధునిక క్రీడా మౌలిక వసతులు కల్పించాలని విజ్ఞప్తి చేశారు. గ్రామీణ యువతలోని క్రీడా ప్రతిభను వెలికితీసేందుకు పరస్పర సహకారంతో కలిసి పనిచేయాలని ఇరువురు చర్చించారు.

Tags: Minister requests establishment of boxing training center in Rayachoti.