ఒంటిమిట్టముచ్చట్లు:
ఒంటిమిట్ట సర్కిల్ పరిధిలో అక్రమ ఇసుక రవాణా, అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని సీఐ వెంకటేశ్వర్లు హెచ్చరించారు. చట్టవిరుద్ధ కార్యకలాపాలపై పోలీసులు నిరంతరం నిఘా ఉంచుతున్నారని, నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కేసులు నమోదు చేసి చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని తెలిపారు. ప్రజలు కూడా అనుమానాస్పద కార్యకలాపాలపై పోలీసులకు సమాచారం అందించాలని కోరారు.
Tags: Crackdown on illegal sand transport