సదుం ముచ్చట్లు:
మండల కేద్రంలోని సామాజిక వైద్య
శాలను మోడల్ హాస్పిటల్గా తీర్చిదిద్దేలా తన వంతు సహకారం అందిస్తానని రాజం పేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్రెడ్డి తెలిపారు. వైద్యశాలను సోమవారం ఆయన తనిఖీ చేశారు. రోగులకు అందిస్తున్న వైద్యసేవ లను ఆరా తీశారు. నిర్మాణంలో ఉన్న డయా లసిస్, పోస్టుమార్టం గదులను పరిశీలిం చారు. పనులను పూర్తి చేయాలని ఆదేశిం చారు. వాటి నిర్మాణ పనుల పూర్తికి, ఫ్రీజర్ బాక్సుల కొనుగోలుకు రూ.24 లక్షల నిధులు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. వాటి ప్రతిపాదనలు వెంటనే పం పాలని జెడ్పీటీసీ సభ్యుడు సోమశేఖర్ రెడ్డికి సూచించారు. ఖాళీగా ఉన్న పోస్టులను వెం టనే భర్తీ చేయాలని
కోరారు.


Tags: MP funds for hospital development