జమ్మూకశ్మీర్ ముచ్చట్లు:
జమ్మూ కాశ్మీర్‌లోని కిష్టవార్‌లో ఆదివారం రాత్రి కురిసిన భారీ వర్షం కారణంగా క్వార్ జలవిద్యుత్ ప్రాజెక్టు వద్ద క్లౌడ్‌బరస్ట్ సంభవించింది.
దీనితో కొండచరియలు విరిగిపడి, ప్రాజెక్టు ప్రదేశంలో బురద, రాళ్లు, శిథిలాలు పేరుకుపోయాయి. అనేక వాహనాలు, ట్రక్కులు, ట్యాంకర్లతో సహా బురదలో కూరుకుపోయాయి.
జమ్మూ-కిష్టవార్ జాతీయ రహదారి కూడా మూసుకుపోయింది. అధికారులు పునరుద్ధరణ పనులు చేపడుతున్నారు. దోడా జిల్లాలోని ప్రేమ్ నగర్ ప్రాంతంలో కూడా కొండచరియలు విరిగిపడి రహదారి మూసివేయబడింది.
Tags: Cloudburst in Kishtwar, Jammu & Kashmir