July 6, 2026
Explore
పారదర్శకమైన ఓటర్ల జాబితా తయారీకే ‘సర్’ కార్యక్రమం

పారదర్శకమైన ఓటర్ల జాబితా తయారీకే ‘సర్’ కార్యక్రమం

July 6, 2026 | Andhra Pradesh

ఓటరు నమోదు అధికారి శారదా దేవి

తిరుపతి ముచ్చట్లు:

167 – తిరుపతి అసెంబ్లీ నియోజకవర్గంలో పారదర్శకమైన ఓటర్ల జాబితా సిద్ధం చేసేందుకు ఓటర్ల జాబితా యొక్క ప్రత్యేక సమగ్ర సవరణ (సార్) ప్రక్రియను నిర్వహిస్తున్నామని ఓటరు నమోదు అధికారి శారదా దేవి తెలిపారు.
సోమవారం ఎస్.టి.వి నగర్, ఎస్.జి.ఎస్. కళాశాల ఏరియా, ఆటో నగర్, ముత్యాల రెడ్డి పల్లి, 12,13 వార్డు సచివాలయం తదితర ప్రాంతాల్లో జరుగుతున్న ప్రత్యేక ఓటర్ల సవరణ (సార్) కార్యక్రమాన్ని ఆమె క్షేత్రస్థాయిలో పరిశీలించారు.
ఈ సందర్భంగా ఇంటింటికీ వెళ్లి ప్రజలను కలుసుకుని, వారికి ఎన్యూమరేషన్ ఫారాలు అందాయా అని అడిగి తెలుసుకున్నారు. 2002 తరువాత ఈ ప్రత్యేక ఓటర్ల సవరణ నిర్వహిస్తున్నామని తెలిపారు. పారదర్శకమైన ఓటర్ల జాబితా సిద్ధం చేసేందుకు ఈ ప్రక్రియ నిర్వహిస్తున్నామని తెలిపారు. ఎన్నికల కమిషన్ నేతృత్వంలో నిర్వహిస్తున్న ప్రత్యేక ఓటర్ల సవరణ (సార్) కు ప్రజలందరూ సహకరించాలని తెలిపారు. మీకు ఇచ్చిన ఫారాలను పూర్తిగా నింపి వీలైనంత త్వరగా సంబంధిత సిబ్బందికి అందజేసి సహకరించాలని ఓటర్లకు సూచించారు. అర్హులైన ప్రతి ఒక్కరి పేరు ఓటర్ల జాబితాలో నమోదు అయ్యేలా నిబంధనలకు అనుగుణంగా, పారదర్శకంగా ప్రక్రియను నిర్వహించాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో వెటర్నరీ ఆఫీసర్ గుణశేఖర్, డి. ఈ. లు మహేష్, లలిత, స్వర్ణ వార్డు కార్యదర్సులు, బూత్ లెవల్ అధికారులు (బిఎల్వోలు) తదితరులు పాల్గొన్నారు.

Tags: The ‘SAR’ program is aimed at preparing a transparent voters’ list.