మదనపల్లె ముచ్చట్లు:
ఆంధ్రప్రదేశ్ క్రీడా ప్రాధికార సంస్థ (SAAP) ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించనున్న ‘అమరావతి ఛాంపియన్‌షిప్–2026’ ప్రచార పోస్టర్లను సోమవారం మదనపల్లె కలెక్టరేట్‌లోని పీజీఆర్ఎస్ సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో దాగి ఉన్న క్రీడా ప్రతిభను వెలికితీసి ప్రోత్సహించేందుకు ఆంధ్రప్రదేశ్ క్రీడా ప్రాధికార సంస్థ ఈ ప్రతిష్ఠాత్మక ఛాంపియన్‌షిప్‌ను నిర్వహిస్తోందన్నారు. జిల్లాలో నియోజకవర్గ, జిల్లా స్థాయి పోటీలను విజయవంతంగా నిర్వహించేందుకు సంబంధిత శాఖలు పరస్పర సమన్వయంతో పనిచేసి అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని అధికారులకు సూచించారు.
ఈ కార్యక్రమంలో భాగంగా అథ్లెటిక్స్, ఆర్చరీ, బ్యాడ్మింటన్, బాస్కెట్‌బాల్, బాక్సింగ్, చెస్, హాకీ, కబడ్డీ, ఖో-ఖో, వాలీబాల్, వెయిట్‌లిఫ్టింగ్, యోగా తదితర మొత్తం 12 క్రీడాంశాల్లో పోటీలు నిర్వహించనున్నట్లు తెలిపారు.జూలై 15 నుంచి ఆగస్టు 26 వరకు నియోజకవర్గ, జిల్లా, రాష్ట్ర స్థాయిల్లో పోటీలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. అండర్–17, అండర్–23 విభాగాల్లో బాలురు, బాలికలకు ఈ పోటీలు నిర్వహించనున్నట్లు తెలిపారు. జిల్లాలోని అర్హులైన క్రీడాకారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని అధిక సంఖ్యలో పాల్గొనాలని కోరారు.ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ శివ్ నారాయణ శర్మ, సబ్ కలెక్టర్ చల్లా కళ్యాణి, డిఆర్ఓ చంద్రశేఖర్ రెడ్డి, ఎస్డిసి మాధవ కృష్ణారెడ్డి, డి ఎల్ డి ఓ లక్ష్మీపతి, జిల్లా క్రీడా అభివృద్ధి అధికారి జి. చంద్రశేఖర్, జిల్లా స్థాయి అధికారులు పాల్గొన్నారు.
Tags: District Collector Nishant Kumar unveiled the promotional posters for the ‘Amaravati Championship–2026’.