కాలం దాటిన అందని విత్తనాలు
- 5400 క్వింటాళ్ళు కావాల్సి ఉంది
- ప్రభుత్వం ఇచ్చింది 720 క్వింటళ్ళు
- పుంగనూరుకు నామాలే ….
పుంగనూరుముచ్చట్లు:
బాబన్న….శెనగక్కాయలు ఎబ్బుడు ఇస్తావన్న….జూన్ నెలలో రాసిండాం ….జూలై వచ్చిన ఇత్తనాలు ఈలేదే…ఇలా చేస్తే మేము బాగుపడేదేలా…..దిగుబడులు బాగా ఎట్లోస్తుంది చెప్పు….నీకేమన్న ఇది న్యాయమా…రైతులను ఇలా కష్టపడితే ఎలా…అంటు పుంగనూరు నియోజకవర్గ రైతులు చంద్రబాబును ప్రశ్నిస్తున్నారు.
వైఎస్సార్‌సిపి ప్రభుత్వంలో రైతులకు క్రమం తప్పకుండ ఎరువులు , విత్తనాలు, మందులు , సబ్సిడిలు ఆర్‌బికెల ద్వారా సకాలంలో పంపిణీ చేశారు. కానీ తెలుగుదేశం ప్రభుత్వం అధికారం చేపట్టిన తరువాత రైతులకు ఎరువులు , విత్తనాలు సకాలంలో ఇవ్వకపోవడంతో రైతులు అధికారుల వద్దకు తిరిగి విసిగిపోతున్నారు. గత నెలలో భూమి దుక్కిచేసిన విత్తనం లేక రైతులు దిగాలు పడుతున్నారు. వేరుశెనగ విత్తనాలు రాకపోవడంతో రైతులు బాబు కరుణ కోసం ఎదురుచూస్తున్నారు. కానీ పుంగనూరు మండలానికి మాత్రం ఒక గింజ కూడ రాకపోవడం గమనార్హం.
పుంగనూరు వ్యవసాయశాఖ డివిజన్ పరిధిలోని పుంగనూరుకు 1500 క్వింటళ్ళు అవసరం ఉంది. కానీ ఒక బస్తా కూడ రాలేదు. చౌడేపల్లెకి 11000 క్వింటళ్ళు అవసరం కాగా 205 క్వింటళ్ళు పంపిణీ చేశారు. సోమలకు 650 క్వింటళ్ళు అవసరం కాగా 100 క్వింటాళ్ళు అందాయి. సదుంకు 850 క్వింటళ్ళు రావాల్సి ఉండగా 165 క్వింటళ్ళు అందింది. పులిచెర్లకు 700 క్వింటళ్ళు కావాల్సి ఉండగా 150 క్వింటాళ్ళు అందింది. రొంపిచెర్లకు 600 క్వింటళ్ళు అవసరం ఉండగా 100 క్వింటళ్ళు అందింది. మండలాలకు 5400 క్వింటళ్ళ వేరుశెనగ విత్తనాలు పంపిణీ చేసేందుకు అధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. జూన్ నెల 10 నుంచి ఆర్‌బికెలలో వేరుశెనగ విత్తనాల పంపిణీ నమోదు చేశారు. జూన్ పోయి జూలైలో ఆరు రోజులు గడిచిన వేరుశెనగ విత్తనాల జాడ మాత్రం తెలియరాలేదు. రైతులు అధికారుల వద్దకు తిరిగిన ఫలితం శూన్యం.
ఏడి వివరణ…..
ఈ విషయమై వ్యవసాయశాఖ ఏడి శివకుమార్‌ను ఫోన్‌లో వివరణ కోరగా విత్తనాలు రాలేదని , త్వరలోనే వేరుశెనగ విత్తనాలు అందుతుందని , రైతులకు పంపిణీ చేస్తామని, జూలై ఆఖరు వరకు శెనగ విత్తనాలు వేసుకున్న పంటలు బాగ పండుతుందని తెలిపారు.
కాలం దాటితే ఉపయోగం లేదు….
జూలై వెహోదటి వారంలో విత్తనాలు వెహోలకెత్తిపోవాలి. లేదా కాలం దాటిన తరువాత వేరుశెనగ విత్తనాలు వేసిన అవి పురుగులు, చీమలు తినేందుకే. ప్రభుత్వ ఆనాలోచిత చర్యలు కారణంగా రైతులకు సమస్యలు తప్పడం లేదు. సకాలంలో విత్తనాలు, ఎరువులు ఇవ్వకపోతే రైతులు ఎలా బాగుపడాలి.

- రామకృష్ణారెడ్డి, రైతు. ఈడిగపల్లె.
ఒకరిపై ఆధారపడరాదు…
రైతులు తమ శక్తి మేరకు విత్తనాలు, ఎరువులు సకాలంలో సమకూర్చుకుని పంటలు వేయాలి. ప్రభుత్వం ఇస్తుందని ఆధారపడితే మిగిలేది వెహోండిచెయ్యే. జూన్‌లో దుక్కులు చేసిన జూలైలో కూడ విత్తనం వేయకపోతే దిగుబడులు ఎలా వస్తాయి. అసలే ఆకాల వర్షాలు పంటలను, రైతులను ముంచేస్తోంది.

-ఎం.నారాయణప్ప, రైతు, కుమ్మరగుంట.
Tags: Babanna… when will the groundnut seeds be distributed?