తిరుపతి ముచ్చట్లు:
- జిల్లా వ్యాప్తంగా వచ్చిన 73 పిటిషన్ల స్వీకరణ.
- ప్రతి ఫిర్యాదుపై ప్రాధాన్యతతో విచారణ చేపట్టి త్వరితగతిన పరిష్కారానికి జిల్లా ఎస్పీ ఆదేశాలు.
తిరుపతి జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు, ఆదేశాల మేరకు సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో పి.జి.ఆర్.ఎస్. (Public Grievance Redressal System) కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా వ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ఫిర్యాదుదారుల నుంచి మొత్తం 73 పిటిషన్లను స్వీకరించి, వారి సమస్యలను క్షుణ్ణంగా పరిశీలించారు.
ఫిర్యాదుదారుల వినతులను ఓర్పుగా విన్న అధికారులు, ప్రతి ఫిర్యాదును నిష్పక్షపాతంగా విచారించి చట్టపరమైన చర్యలను వేగవంతంగా చేపట్టాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. అలాగే ప్రతి బాధితుడికి సకాలంలో న్యాయం జరిగేలా బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు.
అందిన ప్రతి పిటిషన్‌ను వెంటనే సంబంధిత అధికారులకు పంపించి, ప్రాధాన్యత ఆధారంగా విచారణ పూర్తి చేసి నిర్ణీత గడువులో పరిష్కారం చూపాలని ఆదేశించారు. ప్రజల సమస్యల పరిష్కారంలో జాప్యం, నిర్లక్ష్యానికి ఎట్టి పరిస్థితుల్లోనూ తావు ఉండకూడదని స్పష్టం చేశారు.
ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు, ప్రజల ఫిర్యాదుల ప్రతి వినతిని బాధ్యతాయుతంగా పరిశీలించి, చట్టపరంగా న్యాయం జరిగేలా అధికారులు కట్టుబడి పనిచేయాలి అని సూచించారు.
ఈ కార్యక్రమంలో డీసీఆర్‌బీ డీఎస్పీ రమణ , పి.జి.ఆర్.ఎస్. సీఐ సుదర్శనరావు , ఇతర పోలీసు అధికారులు, సిబ్బంది మరియు ఫిర్యాదుదారులు పాల్గొన్నారు.
Tags; Conduct of the PGRS program at the District Police Office.