July 6, 2026
Explore
పి జి ఆర్ ఎస్ అర్జీలు సకాలంలో నాణ్యతతో పరిష్కారం చూపాలి.

పి జి ఆర్ ఎస్ అర్జీలు సకాలంలో నాణ్యతతో పరిష్కారం చూపాలి.

July 6, 2026 | Andhra Pradesh

….. జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్

మదనపల్లి ముచ్చట్లు:

పి జి ఆర్ ఎస్ అర్జీలు సకాలంలో నాణ్యతతో పరిష్కారం చూపాలని జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ అధికారులను ఆదేశించారు.

సోమవారం కలెక్టరేట్లోని పిజిఆర్ఎస్ హాలు నందు… ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పిజిఆర్ఎస్) కార్యక్రమంలో భాగంగా జిల్లాలోని ఆయా మండలాల నుంచి వివిధ రకాల సమస్యలతో వచ్చిన అర్జీదారుల నుండి జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ అర్జీలను స్వీకరించారు.

ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ తోపాటు.. జాయింట్ కలెక్టర్ శివ్ నారాయణ శర్మ,సబ్ కలెక్టర్ చల్లా కళ్యాణి, డిఆర్ఓ చంద్రశేఖర్ రెడ్డి, ఎస్డిసి మాధవ కృష్ణారెడ్డి, డి ఎల్ డి ఓ లక్ష్మీపతి లు అర్జీలను స్వీకరించారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ… ప్రజా సమస్యల పరిష్కార వేదిక, రెవెన్యూ క్లినిక్ ల అర్జీల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆదేశించారు. అర్జీలను వేగవంతంగా, నాణ్యతగా పరిష్కరించాలన్నారు. ఎలాంటి పెండింగ్ లేకుండా అర్జీలను పరిష్కరించాలని, గ్రీవెన్స్ పై ఎప్పటికప్పుడు మానిటర్ చేయాలని, ఇందులో ఎలాంటి అలసత్వం ఉండరాదన్నారు. సమస్యలను సత్వరమే పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని ఆయా శాఖల అధికారులను ఆదేశించారు. అర్జీలను గడువులోపు అత్యంత నాణ్యతగా పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ప్రభుత్వం నిర్వహించే ఐవిఆర్ఎస్ కాల్స్ నందు పాజిటివ్ పర్ఫార్మెన్స్ (సానుకూల పనితీరు) ప్రజల నుండి సేకరించే అభిప్రాయాలలో పురోగతి సాధించాలని అన్నారు. అన్ని శాఖల అధికారులు వారి వారి శాఖలకు సంబంధించిన పనితీరుపై దృష్టి పెట్టి రాష్ట్రంలో జిల్లాను మెరుగైన స్థానంలో ఉండేలా కృషి చేయాలని తెలిపారు.అనంతరం వివిధ సమస్యలతో వచ్చిన ప్రజల నుండి అర్జీలను స్వీకరించారు.

ప్రజల నుండి అందిన విజ్ఞప్తులలో కొన్ని..

1)మదనపల్లి మండలం అమ్మ చెరువు మిట్ట కు చెందిన షేక్ గౌసియా కూలి పని చేసుకుంటూ జీవిస్తున్న తమ కుమారుడికి 10 సంవత్సరాలు పుట్టినప్పటి నుండి కాళ్లు చేతులు పని చేయవని సదనం సర్టిఫికెట్ కావాలని, ప్రభుత్వం నుండి వచ్చే ఆర్థిక సహాయం కొరకు అర్జీని జిల్లా కలెక్టర్ కు సమర్పించారు.

2)మదనపల్లి మండలం, బికే పల్లెకు చెందిన టి. చిన్న రామాంజులు తనకు 100 శాతంవైకల్యం ఉన్నదని సొంత ఇల్లు, ఆస్తులు లేవు. కుటుంబ పోషణ చాలా కష్టంగా ఉంది. వికలాంగుల పెన్షన్ కోసం దరఖాస్తు ను జిల్లా కలెక్టర్ విన్నవించుకున్నారు.

3)మదనపల్లి మండలం రామారావు కాలనీకి చెందిన పి. రాజ్యలక్ష్మి తన కుమార్తె పి. హేమ శ్రీ గత మూడు సంవత్సరాలుగా ప్రైవేట్ పాఠశాలలో చదువుతోంది. అయినప్పటికీ, నా అనుమతి లేకుండా మదనపల్లె రామారావు కాలనీలోని బాపూజీ మున్సిపల్ ప్రాథమిక పాఠశాలలో 1వ తరగతి విద్యార్థినిగా ఆన్‌లైన్‌లో నమోదు చేసి, తప్పుడు వివరాలు నమోదు చేశారు. అందువల్ల ప్రైవేటు పాఠశాల పాఠశాలలో అడ్మిషన్ చేసుకోవడం కష్టంగా ఉన్నదని అందువల్ల నా కుమార్తె పేరును వెంటనే ప్రభుత్వ పాఠశాల ఆన్లైన్ రికార్డుల నుండి తొలగించాలని జిల్లా కలెక్టర్ కు అర్జీ సమర్పించారు.

ఈ కార్యక్రమంలో మొత్తం 275 అర్జీలు రాగా వాటిపై తగు చర్య తీసుకొని పరిష్కరించు నిమిత్తం సంబంధిత శాఖల అధికారులకు జాయింట్ కలెక్టర్, సబ్ కలెక్టర్ ఎండార్స్ చేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో వివిధ శాఖల జిల్లా అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Tags: PGRS grievances must be resolved in a timely and high-quality manner.