March 23, 2026
Explore
సూర్యాపేటలో స్టాఫ్ నర్స్ ఉద్యోగాల పేరిట ఘరానా మోసం.!

సూర్యాపేటలో స్టాఫ్ నర్స్ ఉద్యోగాల పేరిట ఘరానా మోసం.!

March 23, 2026 | Andhra Pradesh

సూర్యాపేట ముచ్చట్లు:

నిరుద్యోగులకు వల వేసి రూ 1.85 కోట్లు వసూలు చేసిన సూర్యాపేట జిల్లా మద్దిరాల మండలం రెడ్డిగూడెం గ్రామానికి చెందిన దుగ్యాల రఘురాం..

హైదరాబాద్ లోని డీఎంఈ కార్యాల‌యంలో ప‌నిచేస్తున్న వాణి అనే మ‌హిళ‌తో క‌లిసి బాధితులను నమ్మించిన నిందితుడు.

సూర్యాపేటలోని జమ్మిగడ్డకు చెందిన నాగమణి అనే స్టాఫ్ నర్స్‌ను హైదరాబాద్‌లోని డైరెక్టర్ మెడికల్ ఎడ్యుకేషన్ కార్యాలయం వద్ద కలిసిన రఘురామ్..

ఆ సమయంలో నాగమణితో పరిచయం పెంచుకొని సూర్యాపేట జిల్లాతో పాటు వివిధ జిల్లాలకు చెందిన సుమారు 60 మంది నిరుద్యోగులను కలిసి ఉద్యోగాలు ఇప్పిస్తామని నమ్మించి నిరుద్యోగులను.. నాగమణినీ బురిడీ కొట్టించారు. ఒక్కొక్కరి నుండి 3 నుంచి 5 లక్షల వరకు వసూలు చేశారు. ఈ విధంగా 60 మంది నుండి రూ.1 కోటి 85 లక్ష‌లు వ‌సూలు.. ఆ డబ్బుతో ప్లాట్లు, కార్లు కొనుగోలు చేసిన రఘురాం.

బాధితులు పోలీసులను ఆశ్రయించడంతో కేసు నమోదు చేసి నిందితుడిని అరెస్ట్ చేసి విచారిస్తున్న పోలీసులు.

Tags: Major Fraud in Suryapet Under the Guise of Staff Nurse Jobs!