హీరో అల్లు అర్జున్ నేరుగా విచారణకు హాజరవుతారా?
హైదరాబాద్ ముచ్చట్లు:
హైదరాబాద్‌లో సంధ్యా థియేటర్ తొక్కిసలాట కేసుకు సంబంధించి సోమవారం నాంపల్లి కోర్టులో విచారణ జరగనుంది, నింది తులు అందరూ విచారణకు హాజరు కావాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది ఈ క్రమంలో అల్లు అర్జున్, నేరు గా హాజరవుతారా? అనే సస్పెన్స్ కొనసాగుతుంది.
కేసుకు సంబంధించి నిందితులందరూ కోర్టుకు హాజరు కావాలని న్యాయ స్థానం ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది. గత విచా రణ సందర్భంగా ప్రముఖ నటుడు అల్లు అర్జున్ వర్చువల్ విధానం లో కోర్టు ముందు హాజరయ్యారు.
అయితే కేసులో ఉన్న ఇద్దరు నిందితులు కోర్టుకు హాజరు కాకపోవడం తో విచారణను నాంపల్లి కోర్టు నేటికి వాయిదా వేసింది. ఈ కేసులో మొత్తం 23 మంది నిందితు లు ఉన్నారు. వారందరూ కోర్టుకు హాజరైన తర్వాతే తదుపరి విచారణ ప్రక్రియను కొనసాగించాలని న్యాయస్థానం స్పష్టం చేసింది.
దీంతో నేటి విచారణ కు ప్రాధాన్యత ఏర్పడింది. అల్లు అర్జున్ కూడా ఈరోజు జరిగే విచా రణకు ప్రత్యక్షంగా కాకుండా వర్చువల్ విధానంలోనే హాజర య్యే అవకాశం ఉంది. అయితే దీనిపై అధికారిక సమాచారం వెలువ డాల్సి ఉంది. దీనికి కారణం ప్రస్తుతం అల్లు అర్జున్ ముంబైలోనే ఉన్నట్లు తెలిసింది.
Tags: Hearing on Sandhya Theatre stampede case today.