పుంగనూరుముచ్చట్లు:
గ్రామీణ ప్రాంతాల్లో ఎస్టీ కులస్తులు ఎదుర్కొంటున్న సమస్యలను గుర్తించి పరిష్కరించేందుకు రాష్ట్ర ఎస్టీ కమిషన్ మెంబర్లు బొజ్జరెడ్డి, వెంకటప్ప త్వరలో రానున్నట్లు ఎస్టీ కుల జిల్లా అధ్యక్షుడు రామకృష్ణ తెలిపారు. ఆదివారం ఆయన పట్టణంలోని అంబేద్కర్ భవనంలో ఎస్టీ కుల సంఘ ప్రతినిదులతో సమావేశం నిర్వహించారు. త్వరలోనే గ్రామీణ ప్రాంతాల్లో పర్యటించి ఎస్టీ కులస్తుల సమస్యలు గుర్తించి పరిష్కరించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తామని ఆయన తెలిపారు. ఈ సమావేశంలో ఎస్టీ సంఘ నాయకులు మర్రిబాబు, విజయ్‌కుమార్, శ్రీనివాసులు, మునికృష్ణ, పురుషోత్తం, వసంతమ్మ, అలివేలమ్మ, వెంకటరమణ , కిరణ్‌కుమార్, రెడ్డి, నరసింహులు తదితరులు పాల్గొన్నారు.
Tags: Tour to identify the issues faced by ST communities.