July 5, 2026
Explore
ఈశ్వరమ్మ కాలనీలో వ్యక్తికి కత్తి పోట్లు

ఈశ్వరమ్మ కాలనీలో వ్యక్తికి కత్తి పోట్లు

July 5, 2026 | Andhra Pradesh

మదనపల్లె ముచ్చట్లు:

అన్నమయ్య జిల్లాలోని మదనపల్లిలో ఓ వ్యక్తి కత్తి పోట్లకు గురయ్యాడు. పోలీసుల కథనం మేరకు.. మండలంలోని, కొత్తపల్లె పంచాయతి, ఈశ్వరమ్మ కాలనీలో శనివారం రాత్రి ఓ కుటుంబంలో ఘర్షణ జరిగింది. ఈ ఘర్షణలో ఈశ్వరమ్మ కాలనీకి చెందిన దస్తగిరి (50) కత్తిపోట్లకు గురై స్థానిక జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో చేరాడు. సమాచారం అందుకున్న తాలూకా పోలీసులు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితుని వద్దకు చేరుకొని విచారణ చేపట్టారు.

Tags: Man stabbed in Eswaramma Colony