July 4, 2026
Explore
మహిళల కొరకు తక్షణమే మరుగుదొడ్ల సదుపాయం కల్పించాలి

మహిళల కొరకు తక్షణమే మరుగుదొడ్ల సదుపాయం కల్పించాలి

July 4, 2026 | Andhra Pradesh

-​మున్సిపల్ అధికారులకు బీజేపీ మైనారిటీ, ఎస్సీ మోర్చా నాయకుల వినతి

​-రద్దీ ప్రాంతాలలో ‘షీ టాయిలెట్స్’ ఏర్పాటు చేయాలని డిమాండ్

పుంగనూరు ముచ్చట్లు:


పుంగనూరు పట్టణంలోని ప్రధాన కూడళ్ళు మరియు తీవ్ర రద్దీ ఉండే ప్రాంతాలలో మహిళల కొరకు తక్షణమే ప్రజా మరుగుదొడ్ల (యూరినల్స్) సదుపాయం కల్పించాలని రాష్ట్ర బీజేపీ మైనారిటీ మోర్చా నాయకులు అయూబ్ ఖాన్, ఎస్సీ మోర్చా నాయకులు నరసింహులు మున్సిపల్ అధికారులను డిమాండ్ చేశారు. ఈ మేరకు పట్టణ ప్రజలు, మహిళా ప్రయాణికుల తరపున శనివారం వారు ఒక వినతి పత్రాన్ని సమర్పించారు.​ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, పుంగనూరు పట్టణ ప్రధాన కూడలి (మెయిన్ సర్కిల్) మరియు మార్కెట్ పరిసర ప్రాంతాలు ఎప్పుడూ ప్రజలతో, ముఖ్యంగా మహిళలతో ఎంతో రద్దీగా ఉంటాయని పేర్కొన్నారు. అయితే, ఇంతటి ప్రాముఖ్యత గల కేంద్రాలలో మహిళల కొరకు ఎలాంటి పబ్లిక్ టాయిలెట్ సదుపాయం లేకపోవడం అత్యంత విచారకరమన్నారు.​”కనీస సదుపాయాలు లేకపోవడం వల్ల దూర ప్రాంతాల నుండి వచ్చే మహిళలు, పాఠశాల/కళాశాల విద్యార్థినులు మరియు స్థానిక మహిళా వ్యాపారులు అత్యవసర సమయాల్లో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇది వారి ఆరోగ్య భద్రతకు మరియు ఆత్మగౌరవానికి సంబంధించిన తీవ్రమైన సమస్య.”అని అయూబ్ ఖాన్ ఆవేదన వ్యక్త పరిచారు.

Tags; Toilet facilities for women must be provided immediately.