పుంగనూరుముచ్చట్లు:
ఎస్‌ఐఆర్ (స్పెషల్ ఇన్‌టెన్సివ్ రివిజన్) కార్యక్రమంలో ఓట్లు పరిశీలన, నమోదుకు గడువు ఉందని చివరి రోజు వరకు ఉండరాదని వైఎస్సార్‌సిపి జిల్లా ఇన్‌టెలెక్చువల్ ఫోరం కార్యదర్శి ఆర్‌కె.రామకృష్ణ తెలిపారు. శనివారం ఆయన పట్టణంలోని రాంనగర్ కాలనీలో బిఎల్‌వో సుమతి తో కలసి ఇంటింటా ఎస్‌ఐఆర్ పరిశీలన చేపట్టారు. ఎన్యూమరేషన్ ఫారాలు పంపిణీ చేయడం, పరిశీలించడం, డిజిటల్ నమోదు చేయించడం చేపట్టారు. ఈనెల 14 వరకు గడువు ఉన్న ఎప్పటికప్పుడు డిజిటలైజేషన్ చేసుకోవడం మంచిదని , చివరి రోజుకు ఇబ్బందులు లేకుండ ఉంటుందని సూచించారు.
Tags: One should not wait until the last day for SIR.