పుంగనూరుముచ్చట్లు:
గ్రామీణ ప్రాంతాలలోని రేషన్‌షాపుల్లో పంపిణీ చేస్తున్న బియ్యంలో శనివారం పురుగులు, చెత్త రావడంతో లబ్ధిదారులు ఆవేదన చె ందుతున్నారు. మండలంలోని ఇటుకనెల్లూరు రేషన్‌షాపులో రేషన్ తీసుకునేందుకు వెళ్లిన మహిళలకు పురుగుల బియ్యం పంపిణీ చేశారు. అధికారుల నిర్లక్షంతోనే ఇలాంటి నిత్యవసర సరుకులు పంపిణీ అవుతోందని ఆరోపిస్తున్నారు. జిల్లా కలెక్టర్ దీనిపై తక్షణం చర్యలు తీసుకుని, నాణ్యమైన సరుకులు పంపిణీ చేయించాలని కోరుతున్నారు.

Tags: Weevil-infested rice at the Itukanelluru ration shop.