పుంగనూరుముచ్చట్లు:
మండలంలోని సుగాలిమిట్ట గ్రామంలో 8 తాండాలకు చెందిన బంజారవాసులు కలసి నిర్మిస్తున్న శ్రీ సంత్‌సేవాలాల్ ఆలయానికి శనివారం రూ.1.50 లక్షలు విరాళంగా ఇచ్చారు. పట్టణానికి చెందిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ బి.భానుప్రసాద్ లక్షరూపాయలు, మాజీ సర్పంచ్ వెంకట్రమణా నాయక్ రూ.50 వేలు , హీరారూపేంద్ర , మణినాయక్, వినోద్‌నాయక్, రవినాయక్ కలసి రూ.20 వేలు విలువ చేసే సిమెంటు బస్తాలను విరాళంగా ఇచ్చారు. ఈ సందర్భంగా ఆలయ నిర్వాహకులు దాతలను అభినందించారు. ఆలయ నిర్మాణానికి ప్రతి ఒక్కరు చేయూతనివ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఫౌండర్ రవినాయక్, ఆలయ కమిటి సభ్యులు పాల్గొన్నారు.

Tags: Rs. 1.50 lakh donation to Sri Sant Sevalal Temple