అన్నమయ్య జిల్లా ముచ్చట్లు:
అన్నమయ్య జిల్లా ఖజానాకు ఆదాయం పెంచేందుకు అన్ని ఆదాయార్జన శాఖలు సమన్వయంతో పనిచేసి లక్ష్యాలను అధిగమించాలని జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ అధికారులను ఆదేశించారు. మదనపల్లిలో జరిగిన సమీక్ష సమావేశంలో అక్రమ మద్యం రవాణాపై కట్టుదిట్టమైన నిఘా కొనసాగించాలని, చీప్ లిక్కర్, సారా నిర్మూలనకు చర్యలు తీసుకోవాలని సూచించారు.జీఎస్టీ వసూళ్లు, రిజిస్ట్రేషన్లలో పారదర్శకత పాటిస్తూ ఆదాయ వృద్ధికి కృషి చేయాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు.
Tags: Coordination among departments is essential to achieve revenue targets: Collector