July 4, 2026
Explore
గడువులోపు SIR ప్రక్రియ పూర్తి చేయాలి: ఎమ్మెల్యే

గడువులోపు SIR ప్రక్రియ పూర్తి చేయాలి: ఎమ్మెల్యే

July 4, 2026 | Andhra Pradesh

పీలేరు ముచ్చట్లు:

పీలేరు పట్టణంలో ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (SIR) ప్రక్రియ వేగంగా కొనసాగుతోంది. బోదేషావలి దర్గా, సీఎల్‌ఆర్‌సీ కార్యాలయం, కోటపల్లి పాఠశాల, కటుకల వీధి తదితర కేంద్రాల్లో ఓటర్ల వివరాల సేకరణ, ధృవీకరణ చేపట్టారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కిషోర్ కుమార్ రెడ్డి గడువులోపు SIR ప్రక్రియను పూర్తి చేసి అర్హులైన ఒక్క ఓటరు కూడా మిస్ కాకుండా చూడాలని అధికారులకు సూచించారు. తహసీల్దార్ శివకుమార్, స్పెషల్ ఆఫీసర్ యుగంధర్, ఆర్‌ఐ మురగయ్య కార్యక్రమాన్ని పరిశీలించారు.

Tags: SIR process must be completed within the deadline: MLA