పీలేరు ముచ్చట్లు:
పీలేరు మండలం మొరవడిపల్లి గ్రామంలో ఎల్ నినో ప్రభావంపై వ్యవసాయ, అనుబంధ శాఖల ఆధ్వర్యంలో రైతులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు.సహాయ వ్యవసాయ సంచాలకులు కరుణాకర్‌రెడ్డి మాట్లాడుతూ, వర్షాభావ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని తక్కువ నీరు అవసరమయ్యే చిరుధాన్యాలు, పప్పుధాన్యాలు, కూరగాయల సాగుపై దృష్టి పెట్టాలని సూచించారు. మండల వ్యవసాయ అధికారిణి రమాదేవి తుంపర, బిందు సేద్య పద్ధతులను అవలంబించాలని తెలిపారు. ప్రత్యామ్నాయ పంటల సాగుతో రైతులు మెరుగైన ఆదాయం పొందవచ్చని మార్కెట్ యార్డ్ చైర్మన్ పురం రామమూర్తి అన్నారు.
Tags; Awareness programs for farmers on the impact of El Niño