March 23, 2026
Explore
శ్రీ బాలాజీ ఆరోగ్య వర ప్రసాదిని స్కీంకు రూ.11 లక్షలు విరాళం

శ్రీ బాలాజీ ఆరోగ్య వర ప్రసాదిని స్కీంకు రూ.11 లక్షలు విరాళం

March 23, 2026 | Andhra Pradesh

తిరుమల ముచ్చట్లు:

టీటీడీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న శ్రీ బాలాజీ ఆరోగ్య వర ప్రసాదిని పథకానికి అహ్మదాబాద్‌కు చెందిన Arihant Dyestuff Private Limited సంస్థ ప్రతినిధులు సోమవారం రూ.11 లక్షల విరాళం అందించారు.

పేద రోగులకు వైద్య సేవలకు ఉపయోగించాలనే సంస్థ ప్రతినిధుల కోరిక మేరకు తిరుపతికి చెందిన వై. రాఘవేంద్ర ఈ విరాళాన్ని అందజేశారు.

తిరుపతిలోని పరిపాలన భవనంలోని ఈవో ఛాంబర్ లో టీటీడీ ఈవో ఎం. రవిచంద్ర ను కలిసి రూ.11 లక్షల డీడీని ఆయన అందజేశారు.ఈ సందర్భంగా టీటీడీ ఈవో దాతలకు ధన్యవాదాలు తెలియజేసి, వారి సేవాభావాన్ని అభినందించారు.

Tags: Donation of ₹11 Lakhs to the Sri Balaji Arogya Vara Prasadini Scheme