రూ.17.94 లక్షల ఆస్తి స్వాధీనం
పీలేరు ముచ్చట్లు:
అన్నమయ్య జిల్లా పీలేరులో వరుస ఇళ్ల దొంగతనాలకు పాల్పడుతున్న ముగ్గురు సభ్యుల అంతర్రాష్ట్ర దొంగల ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. మదనపల్లిలో నిర్వహించిన మీడియా సమావేశంలో జిల్లా అదనపు ఎస్పీ వెంకటాద్రి వివరాలు వెల్లడించారు. నిందితుల నుంచి రూ.17.44 లక్షల విలువైన 109 గ్రాముల బంగారు ఆభరణాలు, రూ.50 వేల విలువైన మోటార్‌సైకిల్‌ను స్వాధీనం చేసుకోగా మొత్తం స్వాధీనం చేసిన ఆస్తి విలువ రూ.17.94 లక్షలుగా తెలిపారు.
ఈ ముఠా అరెస్టుతో పీలేరు పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన ఏడు దొంగతనం కేసులను ఛేదించినట్లు వెల్లడించారు. ప్రజలు ఇళ్లను ఖాళీ చేసి వెళ్లేటప్పుడు పోలీసులకు సమాచారం ఇవ్వాలని, సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని, అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే 100 లేదా 112కు సమాచారం అందించాలని అదనపు ఎస్పీ సూచించారు.
Tags: Inter-state gang of thieves arrested in Pileru.