రాయచోటి ముచ్చట్లు:
గ్రామ స్థాయి నుంచి జనసేన పార్టీని మరింత బలోపేతం చేయడమే లక్ష్యమని రాయచోటి నియోజకవర్గ జనసేన నాయకుడు పప్పిరెడ్డి మహేశ్వర్ రెడ్డి తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా కొనసాగుతున్న పార్టీ నిర్మాణ సారధుల సమాచార సేకరణ కార్యక్రమానికి కార్యకర్తల నుంచి విశేష స్పందన లభిస్తోందని చెప్పారు. అధిక సంఖ్యలో దరఖాస్తులు వస్తున్న నేపథ్యంలో వాటి స్వీకరణకు మరో రెండు రోజుల గడువు పొడిగించినట్లు వెల్లడించారు.
రాయచోటి నియోజకవర్గ పరిధిలోని ఆరు మండలాల జనసేన నాయకులు, కార్యకర్తలు, వీర మహిళలు పార్టీ బలోపేతానికి ముందుకు వచ్చి దరఖాస్తులు సమర్పించాలని పిలుపునిచ్చారు. గ్రామ, మండల, నియోజకవర్గ, పార్లమెంట్ స్థాయిలో పార్టీ బాధ్యతలు చేపట్టాలనుకునే వారు రాజంపేట పార్లమెంట్ జనసేన కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
Tags: Two-day extension for Janasena ‘Nirmana Sarathulu’ applications.