మదనపల్లి ముచ్చట్లు:
మదనపల్లి కలెక్టరేట్‌లో పర్యాటక, యువజన సర్వీసుల శాఖ ఆధ్వర్యంలో మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు 129వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్, డీఆర్ఓ చంద్రశేఖర్ రెడ్డితో కలిసి అల్లూరి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, దేశభక్తి, ధైర్యసాహసాలకు అల్లూరి సీతారామరాజు ప్రతీక అని, ఆయన త్యాగస్ఫూర్తిని యువత ఆదర్శంగా తీసుకోవాలని పిలుపునిచ్చారు. గిరిజనుల హక్కుల కోసం బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా ఆయన చేసిన పోరాటం భారత స్వాతంత్ర్య ఉద్యమ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిందన్నారు. దేశం కోసం ప్రాణత్యాగం చేసిన మహనీయుల ఆశయాలను ప్రతి ఒక్కరూ స్ఫూర్తిగా తీసుకోవాలని సూచించారు.
Tags: Youth should take Alluri’s patriotism and courage as an inspiration: Collector