మదనపల్లి ముచ్చట్లు:
మదనపల్లిలోని జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు జయంతి సందర్భంగా అదనపు ఎస్పీ (పరిపాలన) ఎం. వెంకటాద్రి ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. జిల్లా ఎస్పీ ధీరజ్ ఆదేశాల మేరకు నిర్వహించిన కార్యక్రమంలో మాట్లాడుతూ, కేవలం 27 ఏళ్ల వయసులోనే దేశ స్వాతంత్ర్యం, గిరిజనుల హక్కుల కోసం ప్రాణత్యాగం చేసిన మహనీయుడు అల్లూరి అని కొనియాడారు. ఆయన త్యాగస్ఫూర్తిని ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని పిలుపునిచ్చారు.
Tags: Additional SP Venkatadri pays rich tribute to Manyam hero Alluri.