ప్రొద్దుటూరు ముచ్చట్లు:
రూ.10 లక్షలు ఇస్తే రూ.40 లక్షల బ్లాక్ మనీ ఇస్తామని ఆశ చూపించి అమాయకులను మోసం చేస్తున్న 12 మంది సభ్యులతో కూడిన ముఠా గుట్టును పోలీసులు రట్టు చేశారు.
ముఠాలోని ఓ సభ్యుడు బాధితులకు ఫోన్ చేసి, తన వద్ద రూ.2 కోట్ల బ్లాక్ మనీ ఉందని, దాన్ని వైట్‌గా మార్చుకోవాల్సి ఉందని చెబుతాడు. ఇందుకు రూ.10 లక్షలు ఇస్తే, ప్రతిగా రూ.40 లక్షలు ఇస్తానని నమ్మిస్తాడు.
బాధితుడు డబ్బులతో వచ్చిన తర్వాత, ఫేక్ నోట్లతో నింపిన బ్యాగ్‌ను తన అనుచరుడి ద్వారా అందజేస్తారు. అదే సమయంలో నకిలీ పోలీసుల వేషంలో వచ్చిన ముఠా సభ్యులు దాడి చేసి, దొంగనోట్ల వ్యాపారం చేస్తున్నారని, మోస్ట్ వాంటెడ్ నేరస్థులని బెదిరించి బాధితుడి వద్ద ఉన్న నగదును తీసుకుని పరారవుతారు.
ఈ మోసానికి గురైన ప్రొద్దుటూరుకు చెందిన గంగాధర్‌రెడ్డి ఫిర్యాదుతో ఈ ముఠా బాగోతం వెలుగులోకి వచ్చింది. కేసులో మొత్తం 12 మంది నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి సుమారు రూ.18 లక్షల నగదు, 16 మొబైల్ ఫోన్లు, నకిలీ పోలీసు యూనిఫాంలు, మూడు కార్లను స్వాధీనం చేసుకున్నారు.
Tags: Police bust 12-member gang