July 4, 2026
Explore
కృష్ణమ్మ వెలవెల..ప్రాణహితకు జలకళ…

కృష్ణమ్మ వెలవెల..ప్రాణహితకు జలకళ…

July 4, 2026 | Andhra Pradesh

ఈ ఏడాది వరదలేక ఆయకట్టు రైతుల్లో మొదలైన ఆందోళన…

గతేడాది మే నెలలోనే జూరాలకు వరద
జూన్లో ప్రాజెక్టు గేట్ల ఎత్తివేత
మహారాష్ట్రలో వర్షాలతో పరవళ్లు తొక్కుతున్నప్రాణహిత
గద్వాల/కాగజ్ నగర్: జూరాల వద్ద కృష్ణమ్మ వెలవెలబోతున్నది.

మహారాష్ట్రముచ్చట్లు:

ఈ ఏడాది ఎగువన వర్షాలు లేకపోవడంతో కృష్ణా నదికి వరదలు రాక ప్రాజెక్టు దిగువన ఇసుక, రాళ్లు తేలి కనిపిస్తున్నది. పాత కాలపు సామెత ‘ఏరు ముందా ఏరువాక ముందా?’ అంటే ఈ ఏడాది ఏరువాకే ముందు వచ్చిందిగాని, వరద రాలేదు. గతేడాది మే 27 నుంచే జూరాలకు ఇన్ ఫ్లో ప్రారంభమైంది. అప్పటి వరకు3.2 టీఎంసీల నీరు నిల్వ ఉండగా.. మే 29 నాటికి 7.78 టీఎంసీలకు చేరింది. అదే రోజు రాత్రి నుంచి లక్ష క్యూసెక్కుల ఇన్ ఫ్లో నమోదు కావడంతో ముందస్తు హెచ్చరికల నేపథ్యంలో ప్రాజెక్టు పది గేట్లను ఎత్తి దిగువన శ్రీశైలం ప్రాజెక్టుకు నీటిని వదిలారు.

శ్రీశైలం ప్రాజెక్టుకు 2025 మే 29 నుంచి వరద ప్రారంభమైంది. అప్పటి వరకు ప్రాజెక్టులో 39 టీఎంసీల నీరు ఉండగా.. క్రమంగా జూన్ 3 వరకు వరద కొనసాగడంతో 70 టీఎంసీల నీరు వచ్చి చేరింది. దీంతో జూన్ మొదటి వారం నుంచి ఆఫీసర్లు లిఫ్టులను ప్రారంభించారు. జూరాల పరిధిలోని భీమా లిఫ్ట్-1, లిఫ్ట్-2, కోయిల్సాగర్, లెఫ్ట్ మెయిన్ కెనాల్, రైట్ మెయిన్ కెనాల్, ఆర్డీఎస్ ప్యార్లల్ కెనాల్స్కు నీటిని వదిలారు.

Tags: The Krishna River looks pale… Pranahita is brimming with water.