March 23, 2026
Explore
దళితుల సమస్యలపై పోరాటం

దళితుల సమస్యలపై పోరాటం

March 23, 2026 | Andhra Pradesh

పుంగనూరుముచ్చట్లు:

దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న ఎస్సీ, ఎస్టీ ల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని లేకపోతే పోరాటం చేస్తామని దళిత సంక్షేమ సేవాసమితి రాష్ట్ర అధ్యక్షుడు శంకరప్ప హెచ్చరించారు. సోమవారం బిఎంఎస్‌క్లబ్‌లో కార్యవర్గ సమావేశం నిర్వహించారు. నూతన కార్యవర్గ సభ్యులను ఎన్నుకున్నారు. అన్నమయ్య జిల్లా యూత్‌ అధ్యక్షుడుగా రాజును ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అలాగే పలమనేరుకు సుఖేష్‌కుమార్‌, పుంగనూరుకు నాగభూషణంను ఎన్నుకుని వారిని సన్మానించారు. శంకరప్ప మాట్లాడుతూ సమస్యల పరిష్కారంలో అధికారులు నిర్లక్షం చేయకుండ పరిష్కరించాలన్నారు. ఈ సమావేశంలో దళిత నాయకులు పెంచుపల్లి కృష్ణప్ప,గంగప్ప, కుమార్‌, నాగరాజు, సుబ్రమణ్యం, ప్రతాప్‌, రెడ్డెప్ప, అశోక్‌, అమ్మిగానిపల్లె అశోక్‌, మహేష్‌ తదితరులు పాల్గొన్నారు.

Tags: Struggle for Dalit Issues