July 3, 2026
Explore
జూలై నెలలో శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో విశేష ఉత్స‌వాలు

జూలై నెలలో శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో విశేష ఉత్స‌వాలు

July 3, 2026 | Andhra Pradesh

తిరుపతి ముచ్చట్లు:

  తిరుప‌తి శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో జూలై నెలలో పలు విశేష ఉత్సవాలు జరుగనున్నాయి. వాటి వివరాలు ఇలా ఉన్నాయి.
  • జూలై 10, 31వ‌ తేదీల్లో శుక్రవారాల్లో సాయంత్రం 6 గంటలకు శ్రీ ఆండాళ్ అమ్మవారిని ఆలయ నాలుగు మాడ వీధుల్లో ఊరేగింపు నిర్వహిస్తారు.
  • జూలై 12న రోహిణి నక్షత్రం సందర్భంగా సాయంత్రం 6 గంటలకు రుక్మిణి, సత్యభామ సమేత శ్రీపార్థసారధిస్వామివారు మాడ వీధుల్లో ఊరేగి భక్తులను కటాక్షిస్తారు.
  • జూలై 19న ఉత్తర నక్షత్రం సందర్భంగా శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ గోవిందరాజస్వామి వారు మాడ వీధులలో విహరిస్తారు.
  • జూలై 17న ఆల‌యంలో ఆణివార ఆస్థానం ఘ‌నంగా నిర్వ‌హించ‌నున్నారు.
  • జూలై 22వ తేదీ శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ గోవిందరాజస్వామి వారు అహోబిలం మఠానికి వేంచేపు చేస్తారు.
  • జూలై 24 నుండి 26వ తేదీ వ‌ర‌కు శ్రీ గోవింద‌రాజ‌స్వామివారి ఆలయంలో జ్యేష్టాభిషేకం.
  • జూలై 26న తుల‌సీ మ‌హ‌త్యం ఉత్స‌వం సంద‌ర్భంగా ఉదయం శ్రీ గోవిందరాజ స్వామివారు గరుడ వాహనంపై భక్తులను క‌టాక్షించ‌నున్నారు.
  • జూలై 29న పౌర్ణ‌మి సంద‌ర్భంగా సాయంత్రం 6 గంట‌ల‌కు శ్రీ గోవింద‌రాజస్వామివారి గ‌రుడ సేవ‌.

Tags: Special festivals at the Sri Govindaraja Swamy Temple in July