పుంగనూరుముచ్చట్లు:
పట్టణంలోని లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఉచిత గుండెజబ్బు చికిత్స శిబిరానికి అపూర్వ స్పందన లభించింది. శుక్రవారం క్లబ్ ప్రాజెక్టు మేనేజర్ డాక్టర్ శివ, అధ్యక్షుడు మహేంద్రరావు ఆధ్వర్యంలో కోలారు ఆర్‌ఎల్ జాలప్ప హార్ట్సెంటర్ వైద్యులచే శిబిరం నిర్వహించారు. 46 మంది శిబిరంలో పాల్గొని గుండె పరీక్షలు చేసుకున్నారు. అవసరమైన వారికి చికిత్సలు చేసి ఆపరేషన్లు నిర్వహిస్తామని వైద్యులు తెలిపారు. ఈ కార్యక్రమంలో క్లబ్ ప్రతినిదులు బాలసుబ్రమణ్యం, సుధాకర్‌రావు, సురేష్, వరదారెడ్డి, కేశవరెడ్డి, శ్రీరాములు తదితరులు పాల్గొన్నారు.
Tags: Response to the free heart medical camp