March 23, 2026
Explore
నక్కబండలో అసాంఘిక కార్యక్రమాలకు చెక్‌

నక్కబండలో అసాంఘిక కార్యక్రమాలకు చెక్‌

March 23, 2026 | Andhra Pradesh

పుంగనూరుముచ్చట్లు:

నక్కబండలోని జగనన్న కాలనీ, టిడ్కో గృహాల్లో అసాంఘిక కార్యక్రమాలు నిర్వహిస్తే క్రిమినల్‌ కేసులు నమోదు చేసి, జైలుకు పంపిస్తామని సీఐ సుబ్బరాయుడు స్పష్టం చేశారు. సోమవారం నక్కబండకు చెందిన మహిళా నాయకురాలు సల్మా ఆధ్వర్యంలో ఆప్రాంత వాసులు సీఐ, కమిషనర్‌కు వినతిపత్రం అందజేశారు. నక్కబండ ప్రాంతంలో నూతన వ్యక్తులు రావడం, మధ్యం, గంజాయి సేవిస్తూ మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్నారని , కొంత మంది వ్యబిచార గృహాలు నిర్వహిస్తున్నారని ఫిర్యాదు చేశారు. దీనిపై సీఐ స్పందిస్తూ తక్షణమే నిఘా ఏర్పాటు చేస్తామన్నారు. అనుమాసన్పద వ్యక్తులు వస్తే తమకు సమాచారం అందించాలని తెలిపారు.

Tags: Check on anti-social activities in Nakkabanda