, ప్రశంసా పత్రాలు అందజేసిన జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా
విధి నిర్వహణలో మరణించిన ఐదుగురు సిబ్బంది కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.50,000/- ఆర్థిక సహాయం అందజేత.
అనకాపల్లి ముచ్చట్లు:
పోలీసు కుటుంబాల పిల్లలను ఉన్నత విద్యలో ప్రోత్సహిస్తూ, వారికి భవిష్యత్తులో ఉన్నత స్థాయిలో ఎదగడానికి ప్రేరణనిస్తూ జిల్లా పోలీస్ అసోసియేషన్ అడహాక్ కమిటీ ఆధ్వర్యంలో ప్రతిభ గల విద్యార్థులకు ప్రశంసా పత్రాలు, నగదు బహుమతులు జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా, చేతుల మీదుగా అందజేయడం జరిగింది.
2025-26 విద్యాసంవత్సరం లో 10వ తరగతి, ఇంటర్మీడియట్ పరీక్షల్లో అత్యధిక మార్కులు సాధించిన 29 మంది పోలీసు కుటుంబాల విద్యార్థులకు రూ.1.52 లక్షల విలువైన స్కాలర్షిప్‌లను జిల్లా ఎస్పీ అనకాపల్లి పట్టణం, పోలీస్ గెస్ట్ హౌస్ లో జరిగిన కార్యక్రమంలో అందజేశారు. ఈ సందర్భంగా వారు విద్యార్థులతో మమేకమై, ఉన్నత లక్ష్యాలను నిర్ధేశించుకుని కృషి చేస్తే విజయాలను సాధించడం సులభమని ఆకాంక్షించారు.
ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ: “పోలీసు సిబ్బంది సంక్షేమంలో భాగంగా, వారి పిల్లలు ఉన్నత విద్యలో ముందుకు వెళ్లాలని, మంచి ర్యాంకులు సాధించి భవిష్యత్తులో స్థిరపడాలని కోరుకుంటున్నాం. ఈ కార్యక్రమంలో ప్రతి విద్యార్థిలో కొత్త స్పూర్తిని నింపుతుంది.” అని తెలిపారు. విద్యార్థులతో జిల్లా ఎస్పీ శ్రద్ధగా వారు సాధించిన మార్కులు, ప్రస్తుత చదువులు, భవిష్యత్తు లక్ష్యాలు తెలుసుకొని వారికి తగిన సూచనలు, సలహాలు ఇచ్చారు. విద్యార్థుల ఉత్సాహాన్ని పరిశీలించిన ఎస్పీ, వారికి సాధ్యమైనంత సహాయం అందించేందుకు జిల్లా పోలీసు శాఖ ఎల్లప్పుడూ ముందుంటుందని తెలిపారు.
మరణించిన సిబ్బంది కుటుంబాలకు ఆర్థిక భరోసా: అనంతరం జిల్లా పోలీస్ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో విధినిర్వహణలో మరణించిన ఐదుగురు పోలీస్ సిబ్బంది కుటుంబ సభ్యులకు ఒక్కొక్కరికి రూ.50,000/- చొప్పున నగదు చెక్ లను అదనపు ఎస్పీ ఎల్.మోహన రావు అందజేశారు.
మరణించిన పోలీస్ సిబ్బంది వివరాలు
ఎ.శాతవాహనుడు (ASI-948) – పెంటకోట మెరైన్ పి.ఎస్,
కె.శ్రీను (HC-128) – మాకవరపాలెం పి.ఎస్,
డి.త్రినాథరావు (HC-999) – గొలుగొండ పి.ఎస్
కె.రమణమూర్తి (HC-1359) – CCS-AKP,
కె.పి.ఆర్.వి.ఎన్. ప్రసాద్ (HC-3585) – CCS-AKP / పరవాడ ఎస్.బి
ఈ సందర్భంగా అదనపు ఎస్పీ ఆయా కుటుంబ సభ్యులతో మాట్లాడుతూ.. వారి వివరాలు మరియు పోలీస్ శాఖ తరపున రావలసిన ఆర్థికపరమైన ప్రయోజనాలను త్వరితగతిన పరిష్కరించేందుకు చర్యలు చేపడతామన్నారు. అలాగే వారికి కారుణ్య నియామకాలకు సంబంధించి జిల్లా కలెక్టర్ తో మాట్లాడి త్వరితగతిన జరిగే విధంగా చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు. ఎటువంటి సమస్యలు ఉన్నా తక్షణమే సహాయపడేందుకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటామని కుటుంబ సభ్యులకు తెలిపి వారిని ఓదార్చారు.
ఈ కార్యక్రమంలో డీఎస్పీలు శ్రీ జీ.ఆర్.ఆర్.మోహన్, కె.రవికుమార్, ఇన్స్పెక్టర్లు లక్ష్మి, వెంకట్ నారాయణ, గఫూర్, ప్రేమ కుమార్ ఇతర పోలీస్ అధికారులు, పోలీస్ అసోసియేషన్ అడహాక్ అధ్యక్షులు సిసిఎస్ ఇన్స్పెక్టర్ అప్పలనాయుడు, ట్రెజరర్ లలిత, సభ్యులు అచ్చయ్య, భూలోక, సత్యనారాయణ, మల్లీశ్వరి, శేషాద్రి, రాష్ట్ర పోలీస్ అధికారుల సంఘం సభ్యుడు ఎస్ఐ శేషగిరిరావు తదితరులు పాల్గొన్నారు.
Tags:Scholarships to encourage the talent of police children