July 3, 2026
Explore
డీఎస్పీ భీంరెడ్డి ఇంట్లో ఏసీబీ సోదాలు..

డీఎస్పీ భీంరెడ్డి ఇంట్లో ఏసీబీ సోదాలు..

July 3, 2026 | Andhra Pradesh

హైదరాబాద్ ముచ్చట్లు:

హైదరాబాద్ లో ఏసీబీ సోదాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. డీఎస్పీ భీంరెడ్డి ఇంట్లో అధికారులు డైరీని స్వాధీనం చేసుకున్నారు. డైరీలో 15 మంది బినామీల పేర్లను భీంరెడ్డి రాసినట్టు గుర్తించారు. ఇప్పటి వరకు తనిఖీలలో రూ.200 కోట్లను అధికారులు గుర్తించారు. 16 ప్రాంతాల్లో భీంరెడ్డికి ఆస్తులు ఉన్నట్టు నిర్ధారించారు. అంతేకాకుండా ఇంట్లో కేజీ బంగారం, రూ.40 లక్షలను గుర్తించి వాటిని సీజ్ చేశారు. భీంరెడ్డి 1995లో ఎస్సైగా పోలీస్ శాఖలో విధుల్లో చేరారు. అధిక కాలం పాటు ఆయన హైదరాబాద్ లో విధులు నిర్వహించారు. ఆ తరవాత సీఐగా ప్రమోషన్ పొంది రాయదుర్గం, వనస్థలిపురం, చిక్కడపల్లి తదితర పోలీస్ స్టేషన్ లలో విధులు నిర్వహించారు. డీఎస్పీగా ప్రమోషన్ అందుకున్న తరవాత పటాన్ చెరు డివిజన్ లో పనిచేశారు. ప్రస్తుతం సీఐడీ డీఎస్పీగా ఆయన పనిచేస్తున్నారు. కాగా గతంలో అనేక వివాదాస్పద విషయాల్లో తలదూర్చడం వల్ల భారీగా ఆస్తులు కూడబెట్టారనే ఆరోపణలు ఉన్నాయి. ఇక నేడు ఉదయం నుండి ఏసీబీ సోదాలు నిర్వహిస్తుండగా ఆయన ఆస్తుల చిట్టా బయటపడుతోంది. భీంరెడ్డి బంధువుల ఇళ్లలోనూ తనిఖీలు మణికొండ మున్సిపాలిటీ మాజీ వైఎస్‌ ఛైర్మన్‌ నరేంద్‌రెడ్డి ఇంట్లోనూ ఏసీబీ సోదాలు. భీంరెడ్డి, నరేందర్‌రెడ్డి కలిసి వ్యాపారాలు చేస్తున్నట్లు గుర్తింపు. భీంరెడ్డి ఇంట్లో భారీగా విదేశీ మద్యం బాటిళ్లు గుర్తింపు

Tags: ACB raids DSP Bhimreddy’s house…