తిరుపతి ముచ్చట్లు:
- శెట్టిబలిజ జాతి పితామహుడు, సామాజిక సేవకుడు దొమ్మేటి వెంకటరెడ్డి జయంతి సందర్భంగా తిరుపతి జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఘనంగా కార్యక్రమం నిర్వహించారు.
- ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి నివాళులు అర్పించారు.
- ఈ కార్యక్రమంలో పాల్గొన్న తిరుపతి జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు, ఐపీఎస్., మాట్లాడుతూ, దొమ్మేటి వెంకటరెడ్డి సమాజంలోని వెనుకబడిన వర్గాల అభివృద్ధి కోసం చేసిన కృషి ఆదర్శప్రాయమని పేర్కొన్నారు. ఆయన సేవలు, విలువలు నేటి తరానికి స్ఫూర్తిదాయకమని తెలిపారు.
- దొమ్మేటి వెంకటరెడ్డి సమాజం అభ్యున్నతికి విశేషంగా కృషి చేసి, విద్య, సామాజిక చైతన్యం, సమానత్వం కోసం జీవితాన్ని అంకితం చేసిన మహనీయుడిగా గుర్తింపు పొందారని అన్నారు.
- ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీలు రవి మనోహర్ ఆచారి (శాంతిభద్రతలు), శ్రీనివాసులు (క్రైమ్స్), శ్రీనివాస రావు (సాయుధ దళం), ఎస్‌బీ డీఎస్పీ వెంకటనారాయణ, చంద్రశేఖర్ (సాయుదళం డియస్పి)ఏవో సురేష్ కుమార్ మరియు డీపీవో అధికారులు. సిబ్బంది పాల్గొన్నారు.
Tags: Birth Anniversary of Social Worker Dommeti Venkata Reddy