July 3, 2026
Explore
విద్యుత్ షాక్‌తో మనోహర్ మృతి.

విద్యుత్ షాక్‌తో మనోహర్ మృతి.

July 3, 2026 | Andhra Pradesh

. న్యాయం కోరుతూ బంధువుల ఆందోళన

సంబేపల్లి ముచ్చట్లు:

సంబేపల్లి మండలం బుడ్డారెడ్డి ఇండ్ల సమీపంలో జరిగిన విద్యుత్ ప్రమాదంలో రౌతుకుంట గ్రామ హరిజనవాడకు చెందిన బత్తిన మనోహర్ (44) మృతి చెందాడు. విద్యుత్ స్తంభం ఎక్కిన సమయంలో షాక్‌కు గురై ఈ ఘటన జరిగినట్లు సమాచారం. విషయం తెలిసిన కుటుంబ సభ్యులు, బంధువులు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ రోడ్డుపై ధర్నా నిర్వహించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకుని కేసు దర్యాప్తు చేపట్టారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

Tags: Manohar dies of electric shock.