పశ్చిమాసియా ముచ్చట్లు:
పశ్చిమాసియా ఉద్రిక్తతలపై ప్రధాని మోదీ లోక్‌సభలో కీలక వ్యాఖ్యలు చేశారు. మధ్యప్రాచ్యంలో పరిస్థితి ఆందోళనకరంగా ఉందని, ఈ యుద్ధం ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతోందని అన్నారు. కరోనా మహమ్మారిని ఎదుర్కొన్నట్లే ఈ సంక్షోభాన్ని కూడా దేశం జయిస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. ఇంధన అవసరాల కోసం భారత్ 41 దేశాల నుంచి దిగుమతులు చేసుకుంటోందని, హర్మూజ్ జలసంధి ద్వారా సరఫరాలో అంతరాయం కలగడం సమస్యగా మారిందన్నారు. ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తున్నామని తెలిపారు.
Tags: Just as we tackled Corona… we will overcome this crisis: Modi