పుంగనూరుముచ్చట్లు:
పట్టణంలోని ప్రభుత్వ పశువుల ఆసుపత్రి ఆవరణంలో ఓ గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందిన సంఘటన ఆదివారం చోటు చేసుకుంది. పోలిసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. సుమారు 48 ఏళ్ల వయసు కలిగి వ్యక్తి పట్టణంలోని ప్రభుత్వ పశువుల ఆసుపత్రి ఆవరణంలో మృతి చెంది ఉండటాన్ని స్థానికులు గమనించి సమాచారం తెలిపారన్నారు. సమాచారం మేరకు సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించి , పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. కాగా మృతుడి వివరాలు పోలీసుల దర్యాప్తులో వెల్లడి కావాల్సి ఉంది.
Tags: Unidentified person dies