తిరుమల ముచ్చట్లు:
దేశవ్యాప్త కార్యక్రమంలో భాగంగా తిరుమల శ్రీవారి ఆలయం వద్ద ఆదివారం పల్స్ పోలియో కార్యక్రమాన్ని టీటీడీ అదనపు ఈవో సి.హెచ్.వెంకయ్య చౌదరి పిల్లలకు పోలియో చుక్కలు వేసి ప్రారంభించారు.
టిటిడి ముఖ్య వైద్యాధికారి డాక్టర్ ఎస్.కుసుమ కుమారి ఆధ్వర్యంలో తిరుమలలో 25 ప్రాంతాలలో పల్స్‌పోలియో కేద్రాలను ఏర్పాటు చేశారు. ఇందులో శ్రీవారి ఆలయంతో కలిపి 21 ప్రాంతాలలో భక్తులకు, 4 ప్రాంతాలలో స్థానికులకు ఏర్పాటు చేశారు. ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు జరిగే పల్స్‌పోలియో కార్యక్రమంలో భక్తులు మరియు స్థానికులు 0 నుండి 5 సంవత్సరాల లోపు చిన్నారులకు పోలియో చుక్కలు వేశారు.
కాగా అశ్విని ఆసుపత్రి, జియన్‌సి, ఆర్‌టిసి బస్టాండ్, సిఆర్‌ఓ, పిఏసి 1 మరియు 2, ఎమ్‌బిసి-34, వైకుంఠం 1 మరియు 2, హెల్త్ ఆఫీసు, ఎటిసి, మేదరమిట్ట, వరాహస్వామి, రాంభగీఛ అతిధి గృహలవద్ద, శ్రీవారి ఆలయం లోపల, కల్యాణకట్ట, బాలాజీ నగర్, టిటిడి ఉద్యోగుల డిస్పెన్సరి ఎస్.వి. హైస్కూల్, పాపావినాశనం, అలిపిరి కాలినడక మార్గంలో పల్స్ పోలియో కేంద్రాలను ఏర్పాటు చేశారు. అన్ని కేంద్రాల్లో కలిపి మొత్తం 5255 మంది పిల్లలకు పోలియో చుక్కలు వేశారు.
ఈ కార్యక్రమంలో ఇన్ ఛార్జ్ సూపరింటెండెంట్ డాక్టర్ కళ్యాణి, ఎస్ఎంవో డాక్టర్ సుహర్లత, వైద్యులు డాక్టర్ నవీన్, డాక్టర్ పద్మజ, హెడ్ నర్స్ పుష్పలత, పారా మెడికల్ సిబ్బంది పాల్గొన్నారు.
Tags; Pulse Polio in Tirumala: Polio drops administered to 5,255 children.