June 28, 2026
Explore
పల్స్‌పోలియో లాంఛనంగా ప్రారంభించిన టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి

పల్స్‌పోలియో లాంఛనంగా ప్రారంభించిన టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి

June 28, 2026 | Andhra Pradesh

తిరుమల ముచ్చట్లు:

   జూన్ 28వ తేదీ ఆదివారంనాడు దేశవ్యాప్తంగా నిర్వహించిన పల్స్‌పోలియో కార్యక్రమంలో భాగంగా తిరుమల శ్రీ‌వారి ఆల‌యం వ‌ద్ద టీటీడీ అదనపు ఈవో   సిహెచ్ వెంకయ్య చౌదరి చిన్నారులకు పోలియో చుక్కలు వేసి లాంఛనంగా ప్రారంభించారు.ఈ సందర్భంగా అదనపు ఈవో మాట్లాడుతూ, తిరుమలలో 25 ప్రాంతాలలో పల్స్‌పోలియో కేద్రాలను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఉదయం 7 నుండి సాయంత్రం 6 గంటల వరకు జరిగే పల్స్‌పోలియో కార్యక్రమంలో భక్తులు మరియు స్థానికులు 0 నుండి 5 సంవత్సరాల లోపు చిన్నారులకు విధిగా పల్స్‌పోలియో చుక్కలు వేయించుకోవాలని ఆయన కోరారు.ఈ కార్య‌క్ర‌మంలో సిఎంవో డాక్టర్ కుసుమ కుమారి, వైద్యులు డా.కళ్యాణి, డా. పద్మజ, డా.నవీన్ బాబు, పారా మెడికల్ సిబ్బంది పాల్గొన్నారు.

Tags:TTD Additional EO Ch. Venkaiah Chowdary formally launched the Pulse Polio programme.