తిరుపతి ముచ్చట్లు:
సైబర్ నేరాలు, మహిళా-శిశు రక్షణ, అత్యవసర పోలీస్ సేవలపై అవగాహన.
తిరుపతి జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు ఆదేశాల మేరకు జిల్లా శక్తి (SHE Team) బృందం వేదాంతపురం సమీపంలోని జే.డి.ఆర్. కన్వెన్షన్ హాల్లో “మహిళా ఆరోగ్య శిబిరం” అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి మహిళా పోలీస్ స్టేషన్ అదనపు ఎస్పీ శ్రీలత ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా మహిళల ఆరోగ్య పరిరక్షణ, క్యాన్సర్ నివారణ, గర్భిణుల సంరక్షణ, బాలల ఆరోగ్యం, మహిళలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు తదితర అంశాలపై అవగాహన కల్పించారు.
అలాగే మహిళలు, యువత సైబర్ నేరాల బారిన పడకుండా ఉండేందుకు నకిలీ మొబైల్ యాప్‌లు, ఆన్‌లైన్ మోసాలు, గుర్తు తెలియని ఫోన్ కాల్స్, డిజిటల్ మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అదేవిధంగా మహిళలు, చిన్నారుల రక్షణకు సంబంధించిన చట్టాలు, పోక్సో (POCSO) చట్టం, బాలలపై వేధింపులు, బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన వంటి అంశాలపై కూడా అవగాహన కల్పించారు.
ప్రజలు అత్యవసర పరిస్థితుల్లో వెంటనే పోలీసులను సంప్రదించేందుకు డయల్-112, మహిళల సహాయం కోసం 181, సైబర్ నేరాల ఫిర్యాదుల కోసం 1930 హెల్ప్‌లైన్ నంబర్లను వినియోగించాలని సూచించారు. మహిళలు, చిన్నారుల భద్రతకు సంబంధించిన ఏ సమస్య ఎదురైనా నిర్భయంగా పోలీసులను ఆశ్రయించాలని జిల్లా పోలీసు శాఖ విజ్ఞప్తి చేశారు.
Tags: A comprehensive awareness program on women’s health and safety.