పుంగనూరుముచ్చట్లు:
పట్టణంలోని పోస్టాఫీసులో ఆధార్ సేవలు పునః ప్రారంభించినట్లు పోస్టుమాస్టర్ ఎన్‌ఆర్.నాగరాజు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా పోస్టల్ సూపరింటెండెంట్‌గా బాధ్యతలు స్వీకరించిన కిరణ్ ఆదేశాల మేరకు తిరిగి ఆధార్ సేవలు ప్రారంభించినట్లు ఆయన పేర్కొన్నారు. పుంగనూరు , పరిసర ప్రాంతాల ప్రజలు ఆధార్‌కు సంబంధించి బయోమెట్రిక్, అప్‌డెట్ , వెహోబైల్‌నెంబరు, చిరునామ, ఫోటో, అప్‌డెట్‌లతో సేవలు అందిస్తామని తెలిపారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు .
Tags: Aadhaar services at the post office