గంజి రామమూర్తి.
పుంగనూరుముచ్చట్లు:
మున్సిపాలిటి పరిధిలో అప్కాస్ ద్వారా పని చేస్తున్న ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు ప్రభుత్వంపై నిరసన గళం విప్పారు. ఆదివారం సంఘ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ,జాయింట్ యాక్షన్ కమిటి వైస్ చైర్మన్ గంజిరామమూర్తి ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఉద్యోగులు నిరసన నినాదాలు చేశారు. సభలో రామమూర్తి మాట్లాడుతూ సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు సమానపనికి సమాన వేతనం ఇవ్వాలన్నారు. ఉద్యోగులు మరణిస్తే కుటుంబ సభ్యులకు ఉద్యోగం ఇవ్వాలన్నారు. ఏళ్ల తరబడి పని చేస్తున్న ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను పర్మనెంట్ చేయాలని డిమాండ్ చేశారు. ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. 2014 నాటి ప్రభుత్వశాఖలో పని చేస్తున్న కొంత మంది కాంట్రాక్ట్ ఉద్యోగులకే రెగ్యూలరైజేషన్ అవకాశం ఇచ్చారని, కార్పోరేషన్లు, మున్సిపాలిటిల్లో దశాబ్దాలుగా పని చేస్తున్న యాబైవేల మందికి అన్యాయం జరుగుతోందని తెలిపారు. ప్రజలకు సేవలు అందించడంలో కీలకపాత్ర పోషిస్తున్న ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల పట్ల ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకుని సమస్యలు పరిష్కరించాలన్నారు. లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేపడుతామని హెచ్చరించారు. ఈ సమావేశంలో సంఘ నాయకులు శ్రీరాములు, శ్రీకాంత్‌రెడ్డి, లక్ష్మణకుమార్, గణేష్‌కుమార్, రాము, వెంకటేష్‌తో పాటు అధిక సంఖ్యలో ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులు పాల్గొన్నారు.
Tags; Outsourced employees raise their voices in protest against the government.