June 28, 2026
Explore
తారురోడ్డు వేయకపోతే అమరణ దీక్ష

తారురోడ్డు వేయకపోతే అమరణ దీక్ష

June 28, 2026 | Andhra Pradesh

పుంగనూరుముచ్చట్లు:

పట్టణంలోని పుంగమ్మ చెరువు కట్టపై ఉన్న బెంగళూరు రహ దారిపై తారు రోడ్డు వేయకపోతే అమరణ దీక్షలు ప్రారంభిస్తామని బిజెపి నాయకులు అయూబ్‌ఖాన్‌, నరసింహులు హెచ్చరించారు. ఆదివారం పట్టణ సమీపంలోని యాబైరాళ్ల వెహోరవ వద్ద గల రోడ్డు వద్ద విలేకరుల సమావేశం నిర్వహించారు. ఆర్‌అండ్‌బి అధికారులు, కాంట్రాక్టరు నిర్లక్షం కారణంగా రోడ్డుపై దుమ్మురేగి ప్రజలు ఆనారోగ్యం భారీన పడుతున్నారని ఆరోపించారు. గత నెలలో కొంత భాగం వేసి , మిగిలిన రోడ్డుకు వేయలేదని తక్షణమే మరమ్మతులు చేయాలని డిమాండ్‌ చేశారు.

Tags: Death fast if asphalt road is not laid